Nara Lokesh: ఢిల్లీ వచ్చి అరెస్టు చేసే సత్తా లేని చెత్త కేసు నాపై పెట్టించాడు, యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారన్న నారా లోకేశ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ప్రారంభం కాకూడదని జీవో 1 తెచ్చినా... యువగళం ఆగలేదని, జనగళమై గర్జించిందని అన్నారు.

Nara Lokesh (Photo-TDP/Twitter)

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ప్రారంభం కాకూడదని జీవో 1 తెచ్చినా... యువగళం ఆగలేదని, జనగళమై గర్జించిందని అన్నారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నా జనజైత్రయాత్రగా ముందుకు సాగిందని చెప్పారు.

మళ్లీ యువగళం ఆరంభిస్తామనే సరికి... తన శాఖకు సంబంధం లేని, అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో తనను ఈ 420 సీఎం ఏ14గా చేర్పించారని మండిపడ్డారు. రిపేర్ల పేరుతో రాజమండ్రి బ్రిడ్జిని మూసేయించారని విమర్శించారు. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, అక్రమ అరెస్టులు చేసినా యువగళం ఆగదని చెప్పారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా జన చైతన్యమే యువగళాన్ని వినిపిస్తుందని, ఇచ్ఛాపురం వరకు నడిపిస్తుందని అన్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నా పేరు కూడా చేర్చారు. తప్పకుండా జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఢిల్లీ వచ్చి అరెస్టు చేసే సత్తా లేని చెత్త కేసు నాపై జగన్ పెట్టించాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh (Photo-Video Grab)

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement