Chaganti Meets CM jagan: సీఎం జగన్‌ను కలిసిన చాగంటి కోటేశ్వరరావు, శాంతా బయోటెక్నిక్స్ ఎండీ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి, శాలువాతో సత్కరించిన ఏపీ ముఖ్యమంత్రి
గురువారం తాడేపల్లికి వెళ్లిన చాగంటి, సీఎం జగన్‌తో భేటీ అయ్యి.. అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు. టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం ఇటీవలె నియమించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లికి వెళ్లిన చాగంటి, సీఎం జగన్‌తో భేటీ అయ్యి.. అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు. టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం ఇటీవలె నియమించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వీళ్ల భేటీ మర్యాదపూర్వకంగా జరిగింది. ఈ సందర్భంగా చాగంటిని సత్కరించి.. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమ అందజేశారు సీఎం జగన్. చాగంటితో పాటు శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ ఫౌండర్, డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు.సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం.. సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు చాగంటి, వరప్రసాద్ రెడ్డి. అనంతరం గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని చాగంటి ప్రశంసలు గుప్పించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)