Andhra Pradesh: వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టిన మందుబాబు, కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో ఘటన, నిందితుడు అరెస్ట్
ఏపీలో మద్యం మత్తులో ఓ మందుబాబు చేసిన హల్ చల్ తో బస్సు ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టి వీరంగం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బస్సు నుండి దిగుతూ చేతిలో ఉన్న ఆయుధంతో బస్సు అద్దాలు పగలగొట్టడం చూడవచ్చు.
ఏపీలో మద్యం మత్తులో ఓ మందుబాబు చేసిన హల్ చల్ తో బస్సు ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టి వీరంగం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బస్సు నుండి దిగుతూ చేతిలో ఉన్న ఆయుధంతో బస్సు అద్దాలు పగలగొట్టడం చూడవచ్చు. అతన్ని వారించేందుకు మరో వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు.
స్కూటీ మీద తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి స్కూటి ఎక్కినట్లే ఎక్కి మళ్లీ దిగి బస్సు అద్దాలు పగలగొట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందుతుడిని పట్టుకుని స్టేషన్ కి తరలించారు. అయితే అతను ఎందుకు అలా చేశాడనే దానిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.
drunk man broke the windows of an RTC bus in Uyyuru Center