Andhra Pradesh Elections 2024: ఉండిలో చంద్రబాబుపై భగ్గుమన్న కార్యకర్తలు, ఎమ్మెల్యే టికెట్ రఘురామకు కాకుండా రామరాజుకే ఇవ్వాలని ధర్నా, వీడియో ఇదిగో..

Chandrababu offer Undi ML Ticket to Raghurama Krishnam Raju, TDP Activists Fires on Decision

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ప్రజాగళం రోడ్ షోలో కండువా కప్పి పార్టీలోకి రావాల్సిందిగా రఘురామను చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతోనే మళ్లీ ప్రజల ముందుకు వచ్చానన్నారు. చంద్రబాబు, ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. జూన్ 4న కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని జోస్యం చెప్పారు.

టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రఘురామ సిద్ధమయ్యారు. ఉండి నియోజకవర్గానికి తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరును ప్రకటించింది టీడీపీ. తాజాగా సమీకరణల నేపథ్యంలో ఆ టికెట్‌ను రామరాజుకు కాదని.. రఘురామకృష్ణం రాజుకు ప్రకటించింది టీడీపీ అధిష్టానం. దీంతో అక్కడ టీడీపీ కార్యకర్తుల తిరుగుబాటు బావుటా ఎగేరేశారు. రామరాజుకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ధర్నా చేపట్టారు. నేను సీఎం అయితే ఏపీ రూ. 13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుంది, కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు, విశాఖను వాషింగ్టన్ చేస్తానని హమీ

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement