ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 7 ప్రధాన అంశాలతో ఎన్నికలకు వెళ్తున్నామని, మంచి పాలన కావాలనుకునే వాళ్లంతా ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను రాజధాని చేస్తామని, విశాఖను వాషింగ్టన్ చేస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎం అయితే రాష్ట్రానికి ప్రస్తుతమున్న రూ. 13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుందని అన్నారు. తాను ముఖ్యమంత్రి కావడం కొందరికి ఇష్టం లేదని చెప్పారు.  జనసేన పార్టీని కుక్కతో పోల్చిన కేఏ పాల్, ఎవడికి కావలిరా నీ అపాయింట్మెంట్ అంటూ నారా లోకేష్ మీద ఫైర్, విశాఖ నుంచి ఎంపీగా పోటీలో ఉంటానని వెల్లడి

తాను ముఖ్యమంత్రి అయితే ఉత్తరాంధ్రలో ఏటా 2 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని కేఏ పాల్ అన్నారు. విశాఖను డ్రగ్స్, గంజాయి రహిత నగరంగా మారుస్తానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడతానని తెలిపారు. తన పోరాటం కాణంగానే ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలు మేలో జరుగుతున్నాయని చెప్పారు.

Here's His Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)