Hyderabad: చంద్రబాబు సీఎం కావాలంటూ వెంకటేశ్వరస్వామి ముందు నాలుక కోసుకున్న వీరభక్తుడు, గతంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఇలాంటి పనే..
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి బ్లేడుతో నాలుకను తెగ్గోసుకునే ప్రయత్నం చేశాడు. పశ్చిమ గోదావరికి చెందిన చెవల మహేశ్ స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బ్లేడుతో నాలుక కోసుకున్నాడు
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి బ్లేడుతో నాలుకను తెగ్గోసుకునే ప్రయత్నం చేశాడు. పశ్చిమ గోదావరికి చెందిన చెవల మహేశ్ స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేశ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, గత 10 సంవత్సరాలలో ఆయన బాగా పనిచేశారని వెల్లడి
ఈ సందర్భంగా నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మహేశ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 100 నుంచి 145 సీట్లలో గెలవాలని ఆకాంక్షించాడు. కాగా, జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ గతంలోనూ మహేశ్ ఇలాంటి పనే చేసినట్టు పోలీసులు తెలిపారు.