Nara lokesh Kurchi Madathapetti Dialogue Video: వీడియో ఇదిగో, కుర్చీ మడతపెట్టిన నారా లోకేష్, పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరిక

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Nara lokesh Kurchi Madathapetti Dialogue Video

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బూమ్ బూమ్ బ్యాచ్ చొక్కాలు మడతపెడితే... మేం కుర్చీలు మడతపెట్టడమే అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో మద్య నిషేధం తర్వాతే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడేమని అడుగుతారు? అంటూ నిలదీశారు. ఏపీలో ఉన్న వైసీపీ బ్యాచ్ అంతా బ్లేడ్ బ్యాచ్ అని విమర్శించారు.  చంద్రబాబు నాయుడు నోటి వెంట.. 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్.. వైరల్ వీడియో ఇదిగో!

రాష్ట్రంలో ఉన్న రాజధానిని నాశనం చేసి మరో రెండేళ్లు హైదరాబాదులో కులుకుతామంటున్నారు... మీకసలు సిగ్గుందా? అని మండిపడ్డారు. జగన్ కు దమ్ముంటే ఓసారి యువత వద్దకు వెళ్లాలని లోకేశ్ సవాల్ విసిరారు. జగన్ ఇప్పుడు రైతులన్నా భయపడిపోతున్నాడని, రాజధాని ఫైల్స్ సినిమా అంటే హడలిపోతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులు అన్నారు... ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా? అని ప్రశ్నించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement