Andhra Pradesh Elections 2024: నేను సీఎం అయితే ఏపీ రూ. 13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుంది, కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు, విశాఖను వాషింగ్టన్ చేస్తానని హమీ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 7 ప్రధాన అంశాలతో ఎన్నికలకు వెళ్తున్నామని, మంచి పాలన కావాలనుకునే వాళ్లంతా ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలని కోరారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 7 ప్రధాన అంశాలతో ఎన్నికలకు వెళ్తున్నామని, మంచి పాలన కావాలనుకునే వాళ్లంతా ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను రాజధాని చేస్తామని, విశాఖను వాషింగ్టన్ చేస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎం అయితే రాష్ట్రానికి ప్రస్తుతమున్న రూ. 13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుందని అన్నారు. తాను ముఖ్యమంత్రి కావడం కొందరికి ఇష్టం లేదని చెప్పారు. జనసేన పార్టీని కుక్కతో పోల్చిన కేఏ పాల్, ఎవడికి కావలిరా నీ అపాయింట్మెంట్ అంటూ నారా లోకేష్ మీద ఫైర్, విశాఖ నుంచి ఎంపీగా పోటీలో ఉంటానని వెల్లడి
తాను ముఖ్యమంత్రి అయితే ఉత్తరాంధ్రలో ఏటా 2 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని కేఏ పాల్ అన్నారు. విశాఖను డ్రగ్స్, గంజాయి రహిత నగరంగా మారుస్తానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడతానని తెలిపారు. తన పోరాటం కాణంగానే ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలు మేలో జరుగుతున్నాయని చెప్పారు.
Here's His Tweet