YSRCP Sixth List Released: వైసీపీ ఆరో జాబితా విడుదల, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎండీ ఖలీల్‌, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకట రమణ, లిస్టు ఇదిగో..

నాలుగు పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చింది.

YSRCP Flag (Photo-File image)

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌సీపీ ఆరో జాబితాను విడుదల చేసింది. నాలుగు పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చింది. మేరుగ నాగార్జున, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు.

రాజమండ్రి(ఎంపీ) డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, గుంటూరు ఎంపీగా ఉమ్మారెడ్డి వెంకట రమణ, నర్సాపురం ఎంపీ గూడురి ఉమాబాల(అడ్వొకేట్‌), , చిత్తూరు ఎంపీ(ఎస్సీ) ఎన్‌ రెడ్డప్ప.. మైలవరం ఎమ్మెల్యే సర్నాల తిరుపతిరావు యాదవ్‌, మార్కాపురం ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే కే నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఎండీ ఖలీల్‌(డిప్యూటీ మేయర్‌గా ఉన్నారు), జీడీ నెల్లూరు కే నారాయణస్వామి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బుట్టా రేణుకగా నియమించారు.

ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా.. 61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్చేసింది. ఆరో జాబితాను  10 మందితో విడుదల చేయగా మొత్తం 18 పార్లమెంట్, 66 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.  నరసారావు పేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్‌, ఏడు మందితో వైసీపీ ఐదో జాబితా లిస్టు ఇదిగో

Here's List

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)