YSRCP Flag (Photo-File image)

YSRCP Fifth Constituency Incharge List: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సెంబ్లీ నియోజకవర్గాలకు,పార్లమెంట్‌ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్‌సీపీ తాజాగా ఐదో జాబితాను విడుదల చేసింది.

బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత.. మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్రకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంఛార్జిల మార్పును ప్రకటించారు. ఐదో విడతలో.. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల మార్పును ప్రకటించారు వాళ్లు. నెల్లూరు టౌన్‌ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది పార్టీ.  వైసీపీ నాలుగో జాబితా విడుదల, మొత్తం 9 మంది అభ్యర్థులతో 4వ జాబితా విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఇక . తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది.

YSRCP Fifth List

పార్టీ ఐదో జాబితా విడుదల చేసే క్రమంలో.. పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి(రాజ్యసభ సభ్యులు)కి అదనంగా గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పింది. అలాగే.. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ రీజినల్‌ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్‌ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించింది.