Andhra Pradesh Lift Horror: ఒంగోలులో ఘోర లిఫ్ట్ ప్రమాదం వీడియో ఇదిగో.. తలుపులు తెరిచి ఉండగానే కదిలిన లిఫ్ట్.. తీవ్ర గాయాలతో మహిళ మృతి..

Woman Dies After Lift Moves Down With Doors Open

Andhra Pradesh Lift Horror: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని ఒక నివాస సముదాయంలో నమ్మశక్యం కాని రీతిలో దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. తలుపులు తెరుచుకుని ఉన్న సమయంలోనే లిఫ్ట్ అకస్మాత్తుగా కిందకు కదలడంతో 50 ఏళ్ల వనిత అనే మహిళ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ కన్నుమూశారు.

బాధితురాలు వనిత తన కుమార్తె, మనవడితో కలిసి అపార్ట్‌మెంట్ లిఫ్టులోకి వెళ్లారు. వారిద్దరూ లిఫ్ట్ నుండి బయటకు రాగా.. వనిత బయటకు అడుగు వేస్తున్న సమయంలోనే లిఫ్ట్ తలుపులు తెరిచి ఉన్నప్పటికీ హఠాత్తుగా కిందకు కదిలింది. ప్రమాదాన్ని గ్రహించి తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించినప్పటికీ, కదులుతున్న ఎలివేటర్‌లో చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు.

వీడియో ఇదిగో.. ప‌బ్లిక్‌లో జుట్లు ప‌ట్టుకొని, ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్న యువతులు.. బెంగళూరులోని కబ్బన్ పార్క్ వద్ద రీల్స్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌

వెంటనే స్పందించిన అపార్ట్‌మెంట్ నివాసితులు ఆమెను రక్షించి, అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి క్షీణించడంతో స్పృహ కోల్పోయి, చికిత్స ఫలించక మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానిక నివాస భవనాల్లో ఉన్న లిఫ్టుల నిర్వహణ, భద్రతా ప్రమాణాల తీరుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. లిఫ్ట్ అకస్మాత్తుగా కదలడానికి గల సాంకేతిక కారణాలు ఇంకా తెలియనప్పటికీ.. నిర్వహణ లోపం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Woman Dies After Elevator Moves With Doors Open

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement