Corona in AP: ఏపీలో కొత్తగా 1,337 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 231 కొత్త కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 68,568 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,337 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 231 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 198, ప్రకాశం జిల్లాలో 161, కృష్ణా జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 141, నెల్లూరు జిల్లాలో 139, పశ్చిమ గోదావరి జిల్లాలో 128 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి

Coronavirus-in-India ( photo-PTI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 68,568 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,337 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 231 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 198, ప్రకాశం జిల్లాలో 161, కృష్ణా జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 141, నెల్లూరు జిల్లాలో 139, పశ్చిమ గోదావరి జిల్లాలో 128 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 1,282 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,38,690 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,09,921 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 14,699గా ఉంది. కరోనా మృతుల సంఖ్య 14,070కి పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement