Corona in AP: ఏపీలో కొత్తగా 1,179 మందికి కరోనా నిర్థారణ, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 192 కొత్త కేసులు నమోదు, 13,905 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 49,737 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 192 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 190, కృష్ణా జిల్లాలో 167, పశ్చిమ గోదావరి జిల్లాలో 161 కేసులు వెల్లడయ్యాయి.

A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 49,737 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 192 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 190, కృష్ణా జిల్లాలో 167, పశ్చిమ గోదావరి జిల్లాలో 161 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. అదే సమయంలో 1,651 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,089కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,40,708 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 20,12,714 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,905 మంది చికిత్స పొందుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement