Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో 132 మందికి కరోనా, శ్రీకాకుళం జిల్లాలో 36 కొత్త కేసులు, విశాఖ జిల్లాలో 19 కేసులు, ఇంకా 1,823 మందికి కొనసాగుతున్న చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,228 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 132 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 19 కేసులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,228 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 132 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 19 కేసులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1 కేసు నమోదైంది. అదే సమయంలో 186 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,108 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,817 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,823 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,468కి పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement