Corona in AP: ఏపీలో స్థిరంగా కరోనా కేసులు, గత 24 గంటల్లో 1,365 మందికి కరోనా, 8 మంది మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 13,796 యాక్టివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 56,720 మంది నమూనాలు పరీక్షించగా 1,365 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు.

Coronavirus Pandemic in India (photo-Ians)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 56,720 మంది నమూనాలు పరీక్షించగా 1,365 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,466 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,796 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement