Corona in AP: ఏపీలో కొత్తగా 1,393 మందికి కరోనా పాజిటివ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 272 కొత్త కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 14,797 మందికి కొనసాగుతున్న చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 60,350 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,393 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 272 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 206, నెల్లూరు జిల్లాలో 201, కృష్ణా జిల్లాలో 162 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus test (Photo-ANI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 60,350 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,393 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 272 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 206, నెల్లూరు జిల్లాలో 201, కృష్ణా జిల్లాలో 162 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,296 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,36,179 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,07,330 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 14,797 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,052కి పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement