Corona in AP: ఏపీలో కొత్తగా 624 మందికి కోవిడ్, ప్రస్తుతం రాష్ట్రంలో 7,944 యాక్టివ్‌ కేసులు

Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 38,312 పరీక్షలు నిర్వహించగా.. 624 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,57,252 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ కారణంగా నలుగురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,254కి చేరింది. 810 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,35,054కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,944 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,87,44,941 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement