Corona in AP: చిత్తూరులో ఒక్కసారిగా పెరిగిన కేసులు, కొత్తగా ఏపీలో 765 కేసులు నిర్ధారణ, ప్రస్తుతం రాష్ట్రంలో 10,357 యాక్టివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 45,481 పరీక్షలు నిర్వహించగా.. 765 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,52,763 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ బారినపడి 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,204కి చేరింది.

Coronavirus in US (Photo Credits: PTI)

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 45,481 పరీక్షలు నిర్వహించగా.. 765 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,52,763 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ బారినపడి 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,204కి చేరింది. 24 గంటల వ్యవధిలో 973 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,28,202కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 10,357 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,45,952 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.కొత్తగా చిత్తూరులో 161 కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరిలో 94, గుంటూరులో 91, నెల్లూరులో 91 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా అనంతపురంలో 1 కేసు నమోదు కాగా కర్నూలులో 3 కేసులు నమోదయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement