Corona in AP: ఏపీలో కొత్తగా 37 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో 17 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 10 కొత్త కేసులు నమోదు

పీలో గడచిన 24 గంటల్లో 7,364 కరోనా పరీక్షలు నిర్వహించగా, 37 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 7,364 కరోనా పరీక్షలు నిర్వహించగా, 37 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 42 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,267 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,031 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 506 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement