Andhra Pradesh Shocker: కాకినాడలో దారుణం, మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కౌన్సిలర్ నారాణయరావు, దేహశుద్ది చేసిన స్థానికులు, వీడియో ఇదిగో..
కాకినాడ జిల్లా తునిలో ఓ మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం కలకలం రేపింది. దళిత నాయకుడు, కొండవారిపేట కౌన్సిలర్ నారాణయరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు.
కాకినాడ జిల్లా తునిలో ఓ మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం కలకలం రేపింది. దళిత నాయకుడు, కొండవారిపేట కౌన్సిలర్ నారాణయరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. అయితే తాను అమ్మాయిపై అత్యాచార యత్నం చేయలేదంటూ నారాయణరావు వాదిస్తున్నాడు. బాలిక బంధువుల ఫిర్యాదుతో పోలీసులు నారాయణ రావును అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని శిక్షించాలంటూ గురుకుల పాఠశాల వద్ద బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు బాలికపై 3 సార్లు అత్యాచారం జరిగిందని..గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రక్షణ లేదు అని ఆరోపించారు. పాఠశాల నిర్వహకులు బాలికతో ఎలాంటి సంబంధం లేని నారాయణరావుతో ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. నిందితుడు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతోనే అతనిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Tuni Councillor Narayana Rao Arrested for Attempted Rape of Minor in Kakinada
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)