Thandel Movie Ticket Price Hike: తండేల్ మూవీ టికెట్ ధరల పెంపు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి
తండేల్ సినిమా(Tandel Movie) టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
తండేల్ సినిమా(Tandel Movie) టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు(Tandel Movie Ticket Price Hike) అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదల రోజు నుండి 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది.
మరోవైపు ప్రముఖ సినీ నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ
AP Govt Approves Ticket Price Hike for "Thandel" Movie