YS Jagan Slams Chandrababu Govt: నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు, ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

కావాలంటే నన్ను టార్గెట్‌ చేయండి. అమాయక ప్రజలు, కార్యకర్తల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. మీకు ఓట్లు వేయని ప్రజల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. ఇదసలు మానవత్వం అనిపించుకోదు. ఏదైనా ఉంటే.. తేల్చుకోవాలనుకుంటే.. నాతోనే తేల్చుకోండి. నన్ను చంపాలనుకుంటే చంపేయండి.

YS Jagan Mohan Reddy (Photo-ANI)

ఏపీలో కూటమి ప్రభుత్వ వచ్చాక జరిగిన దాడులపై నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. జాతీయ మీడియా ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయక జనాలపై దాడులు ఆపాలని, ఏదైనా ఉంటే తనతో తేల్చుకోవాలని రాజకీయ ప్రత్యర్థులకు ఆయన పిలుపు ఇచ్చారు. ఎన్డీటీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ‘‘కావాలంటే నన్ను టార్గెట్‌ చేయండి. అమాయక ప్రజలు, కార్యకర్తల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. మీకు ఓట్లు వేయని ప్రజల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. ఇదసలు మానవత్వం అనిపించుకోదు. ఏదైనా ఉంటే.. తేల్చుకోవాలనుకుంటే.. నాతోనే తేల్చుకోండి. నన్ను చంపాలనుకుంటే చంపేయండి. నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు?’’ అని వైఎస్‌ జగన్‌ సూటిగా నిలదీశారు.   వీడియో ఇదిగో, వైసీపీ ధర్నాకు ఉద్దవ్‌ శివసేన మద్దతు, జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన ఎంపీ సంజయ్ రౌత్

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement