Jagan on Nara Lokesh 'Red Book': ఏపీలో లా అండ్ ఆర్డర్ బతకాలంటే చంద్రబాబు, నారా లోకేష్‌లను హత్య కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలి, జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను ముద్దాయిలుగా చేర్చాలన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఇదెక్కడి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagan on On Nara Lokesh 'Red Book'

నంద్యాలలోని సీతారామపురంలో టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కాదు.. రెడ్‌ బుక్‌ పాలన చేస్తున్నారని అన్నారని మండిపడ్డారు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ నాశనం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను ముద్దాయిలుగా చేర్చాలన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఇదెక్కడి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీడీపీ ఎమ్మెల్యేలే చంపండని చెబుతున్నారు, ఇదేం పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్, హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)