Chandrababu Arrest: లోకేష్‌ని విచారించాల్సి ఉంటుంది, లోకేష్‌ని కూడా అదుపులో తీసుకుంటాం - ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్

ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ నిధుల మల్లింపుల్లో లోకేష్ పాత్రపై దర్యాప్తు జరుగుతుంది. ఈ రెండింటిలో లోకేష్ పాత్ర ఉన్నట్లు తేలింది - ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్

Credits: X

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ మంత్రి లోకేష్‌ని కూడా విచారించాల్సి ఉంటుందని . లోకేష్‌ని కూడా అదుపులో తీసుకుంటామని ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు.  ఇది లోతైన ఆర్ధిక నేరమని పేర్కొన్నారు.  ఇదంతా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరిగిందన్నారు. ఈ విచారణలో ముఖ్య పాత్రధారిగా చంద్రబాబు ఉన్నారు. అందుకే కస్టడీలో తీసుకున్నాం. అన్నింటిలోనూ చంద్రబాబు ప్రమేయం ఉందని సృష్టం అయింది. అన్ని వెలుగులోకి తేవడానికి కస్టడీలో విచారణ జరపాల్సి ఉంటుందని ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. నారా లోకేష్ కూడా స్కాంలు చేశాడు. అంతేకాదు ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ నిధుల మల్లింపుల్లో లోకేష్ పాత్రపై దర్యాప్తు జరుగుతుంది. ఈ రెండింటిలో లోకేష్ పాత్ర ఉన్నట్లు తేలింది - ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement