Modi Fun With Pawan: హిమాలయాలకు వెళ్తున్నారా?..పవన్‌ కళ్యాన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరదా సంభాషణ, వైరల్‌గా మారిన వీడియో

ఢిల్లీ 9వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు రేఖా గుప్తా . ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

PM Modi Fun With Pawan Kalyan(X)

ఢిల్లీ 9వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు రేఖా గుప్తా(Modi Fun With Pawan). ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాగా ప్రధానమంత్రితో ఆసక్తికర సంభాషణ జరిగింది.

మోదీ(PM Modi) ఏం మాట్లాడారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా .. తన వస్త్రధారణ చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళుతున్నవా అని అన్నారని తెలిపారు. అలాంటిదేమీ లేదని తాను చెప్పానని అన్నారు. చేయాల్సింది చాలా ఉంది అని పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ప్రధాని తనపై చాలాసార్లు జోకులు వేస్తుంటారని పవన్ చెప్పారు.

పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ

రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా సరే ఎన్డీఏ దీటుగా ఎదుర్కొంటుందని తెలిపారు. అన్ని ఎన్నికల్లో ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుందని అన్నారు. బిహార్ అయినా బెంగాల్ అయినా ఎక్కడా తగ్గేది లేదని అన్నారు.

PM Modi Fun With Pawan Kalyan

PM Modi Fun With Pawan Kalyan

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now