KA Paul: నాకు క్రెడిట్ ఇవ్వని తెలుగు మీడియా కుటుంబాలు సర్వనాశనం అవుతాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లే ఆగిందని తెలిపిన కేఎ పాల్,వీడియో ఇదిగో..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు.

KA Paul (photo-Video Grab)

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు.అయితే క్రెడిట్ మరొకరికి ఇస్తున్నారని మండిపడ్డారు. తనకు క్రెడిట్ దక్కకపోవడానికి కారణం మీ కులంలో పుట్టకపోవడమేనా..? అని అడిగారు.2 నెలలు కష్టపడి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపితే తెలుగు మీడియా నాకు క్రెడిట్ ఇవ్వట్లేదు.. తెలుగు మీడియా కుటుంబాలు సర్వనాశనం అవుతాయని అన్నారు.  గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు, పోలీసులను ఆశ్రయించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement