Tirupati: తిరుపతిలో కుళ్లిన చికెన్ విక్రయాలు.. దుకాణాన్ని సీజ్ చేసిన అధికారులు, పది రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్‌ అమ్ముతున్నారని స్థానికుల షాక్

తిరుపతి(Tirupati)లో కుళ్లిన చికెన్ విక్రయాలు(Chicken Shop) జరుగుతున్న షాప్‌ను సీజ్ చేశారు అధికారులు.

Spoiled Chicken Sold in Tirupati, shop Seize (X)

తిరుపతి(Tirupati)లో కుళ్లిన చికెన్ విక్రయాలు(Chicken Shop) జరుగుతున్న షాప్‌ను సీజ్ చేశారు అధికారులు. ప్రస్తుతం స్థానిక చికెన్ షాపుల్లో కిలో చికెన్‌ను 220 నుంచి 240 రూపాయలకు విక్రయిస్తుండగా, దుకాణంలో కేవలం 150 రూపాయలకే విక్రయిస్తుండడంతో మార్కెట్‌లోని ఇతర షాపుల యజమానుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

చనిపోయిన కోళ్లను కోసి పది రోజుల పాటు డీప్‌ఫ్రీజర్‌లో భద్రపరిచి కుళ్లిన చికెన్‌(Spoiled Chicken) విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మున్సిపల్‌ ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని చికెన్‌ దుకాణాన్ని పరిశీలించగా చికెన్‌ కుళ్లిపోయి, బూజు పట్టి దుర్వాసన వెదజల్లటాన్ని గుర్తించి షాపులు సీజ్ చేశారు.

ఇక పశ్చిమ గోదావరి  జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో  దారుణం జరిగింది. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణం తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం చోటుచేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.   తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ లో ఘటన 

Spoiled Chicken Sold in Tirupati, shop Seize

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement