TDP Suspends MLA Koneti Adimulam: రాసలీలల ఎఫెక్ట్, టీడీపీ నుండి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్, ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు!

ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లైంగిక ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

TDP Suspends MLA Koneti Adimulam from Party says AP TDP President Palla Srinivasarao

రాసలీలల ఎఫెక్ట్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నేత కోనేటి ఆదిమూలం. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లైంగిక ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

ఇక కోనేటి వేధింపులపై బాధితురాలు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని గతంలో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించింది. తనకు న్యాయం చేయకపోతే టీడీపీ ఆఫీసు ముందే ఆత్మహత్య చేసుకుంటానని వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ...ఎమ్మెల్యేనే పార్టీ నుండి సస్పెండ్ చేసింది. టీడీపీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా..ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై బాధితురాలు, పలు న్యూడ్ వీడియోలు రిలీజ్

Here's TDP Letter:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)