YSRCP Again 2024: ట్విట్టర్‌ని షేక్ చేస్తోన్న వైఎస్సార్‌సీపీ ఎగైన్‌ 2024 హ్యాష్‌టాగ్‌, పది నిమిషాల్లోనే జాతీయస్థాయిలో టాప్‌లోకి, తాజాగా ట్రెండింగ్‌లోకి దూసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ట్యాగ్

ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించి నాలుగేళ్లయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ‘వైఎస్సార్‌సీపీ ఎగైన్‌ 2024’ హ్యాష్‌టాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.

YSRCP Again 2024 Hashtag Trending in Twitter: ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించి నాలుగేళ్లయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ‘వైఎస్సార్‌సీపీ ఎగైన్‌ 2024’ హ్యాష్‌టాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. పది నిమిషాల్లోనే ఈ ట్రెండింగ్‌ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.

తన నాలుగేళ్ల పాలనలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సమాచారంతో కూడిన ట్వీట్లను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ట్వీట్‌ చేశారు. వీటికి దేశవ్యాప్తంగా భారీగా వ్యూస్‌ వచ్చాయి. ఇటీవలి కాలంలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో యమా దూకుడుగా వ్యవహరిస్తోంది. గతేడాది సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా జరిగిన ట్రెండింగ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

Tweets

Strong leadership, compassionate governance, and a vision for a prosperous Andhra Pradesh – that's what #YSRCPAgain2024 represents. Join us today! pic.twitter.com/9cLrtpPa4G

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement