Dog Attack Boy in Hyd: షాకింగ్ వీడియో, నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి

హైదరాబాద్ అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడుకుంటున్న పిల్లాడిపై వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. తండ్రి పనిలో నిమగ్నమవ్వడంతో తన అక్కదగ్గరికి వెళ్దామనుకున్న చిన్నారిని కుక్కలు చీల్చిచెండాడాయి.

Screengrab of CCTV footage of Hyderabad boy, Pradeep, being targeted by street dogs. (Photo Credits: Twitter/ANI)

హైదరాబాద్ అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడుకుంటున్న పిల్లాడిపై వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. తండ్రి పనిలో నిమగ్నమవ్వడంతో తన అక్కదగ్గరికి వెళ్దామనుకున్న చిన్నారిని కుక్కలు చీల్చిచెండాడాయి. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అంబర్‌పేట ఛే నంబరు చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌లతో కలిసి బాగ్‌అంబర్‌పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నారు.

ఆదివారం హాలిడే కావడంతో గంగాధర్‌ పిల్లలిద్దర్నీ తాను పని చేస్తున్న సర్వీస్‌ సెంటర్‌‌కు తీసుకువచ్చాడు. కుమార్తెను పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్‌మన్‌తో కలిసి పని మీద బయటకు వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్‌, తర్వాత అక్క కోసం క్యాబిన్‌ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడిచేశాయి. తండ్రి వాటిని వెళ్లగొట్టడంతో బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now