Delhi Excise Policy Case: కవితకు కోర్టులో దక్కని ఊరట, జ్యూడీషియల్ రిమాండ్ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ 14 రోజుల కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ 14 రోజుల కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, తీహార్ జైల్లో కవితను విచారించనున్న సీబీఐ, ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు... ఆ తర్వాత కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. కవితకు రిమాండ్ పొడిగించే అవకాశాలు ఉన్నాయి.
Here's News