Dog Attack in Hyderabad: వీడియో ఇదిగో, 6 ఏళ్ల బాలికపై వీధి కుక్కల దాడి, చిన్నారి కాలు పట్టుకుని రోడ్డు మీద లాగి మరీ అటాక్.. తీవ్ర గాయాలు

6-year-old girl attacked by stray dogs in Rajendranagar Golden Heights Colony

శునకాల దాడిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండగా.. మరెంతో మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి.రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్ కాలనీ లో రోడ్డుపై వెళ్తున్న 6 ఏళ్ల బాలిక పై వీధి కుక్కల దాడి చేశాయి.చిన్నారి గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి కుక్కలను తరిమివేశారు.

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి, తీవ్ర గాయాలు..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..

ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలైయ్యాయి. బాలికను వెంటనే చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు.మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

6 ఏళ్ల బాలికపై వీధి కుక్కల దాడి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement