Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, మద్యం మత్తులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై స్నేహితులు గ్యాంగ్ రేప్, పార్టీ కోసం పిలిచి మరీ అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పార్టీకోసం వచ్చిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు ఆమె స్నేహితులు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటల్లో యువతపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు.

Hyderabad Techie gang-raped by friends at hotel party in Vanasthalipuram

Hyderabad Techie gang-raped by friends: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పార్టీకోసం వచ్చిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు ఆమె స్నేహితులు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటల్లో యువతపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు. వనస్థలిపురంలో ఓ యువతి సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చిందన్న ఆనందంలో తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ రెడ్డి మరియు మరో ఇద్దరు వ్యక్తులకు బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్లో పార్టీ ఇచ్చింది.  యూపీలో దారుణం, మహిళను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి, ముఖానికి నల్లరంగు వేయాలని పంచాయితీ తీర్పు, అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలే కారణం

అయితే సదరు యువతి మద్యం మత్తులోకి దిగిన తర్వాత.. ఆ యువతిని బారులోని రూమ్లోకి తీసుకెళ్లి గౌతమ్ రెడ్డి మరియు మరో వ్యక్తి గ్యాంగ్ రేప్ చేశారు. మత్తు దిగిన తర్వాత స్నేహితుడుతో పాటు తనపై మరొకరు అత్యాచారం చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now