Medak Horror: వీడియో ఇదిగో, ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడికి తెగబడిన ప్రేమోన్మాది, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో బాధితురాలు
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని హైదరాబాద్‌కు తరలించారు.
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని హైదరాబాద్‌కు తరలించారు. ఆమె ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి బెంగళూరుకు చెందిన యువకుడు చేతన్ అలియాస్ కిరణ్ అని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. టౌన్ ఇన్స్‌పెక్టర్ నాగరాజు, ఏఎస్సై రుక్సానా సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు.
young woman Attacked by Lover
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)