Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం, బాలికను నమ్మించి మాయమాటలు చెప్పి అత్యాచారం, నిందితుడిపై పోక్సో కేసు

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థిని(17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ(22) పరిచయం అయ్యాడు.

Minor girl raped at Hyderabad(X)

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థిని(17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ(22) పరిచయం అయ్యాడు. బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించడంతో ఆమె ఈ నెల 9న సికింద్రాబాద్ వచ్చింది.

ఇదే అదునుగా చూసి, ఆమెను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. బాలిక వాంగ్మూలం ప్రకారం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ - ఇబ్రహీంపట్నంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు ఓ డ్రైవర్. ప్రైవేట్ హాస్టల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. హాస్టల్ లోకి వెళ్లి విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారం చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం, ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినిపై డ్రైవర్ రేప్, పోలీసుల విచారణ 

Minor girl raped at Hyderabad.. Here are the details

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now