
Sangareddy, Feb 21: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై (Girl) ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి (Gang Rape) ఒడిగట్టారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాధిత బాలికను అదే కాలనీలో నివాసముండే ముగ్గురు యువకులు చాక్లెట్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళారు. అప్పటికే వాళ్లంతా మద్యం మత్తులో ఉన్నారు.
స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన
మద్యం మత్తులో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు యువకులు
సంగారెడ్డి జిల్లాలో ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో
ఇంటి బయట అడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులు.
తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో పారిపోయే… pic.twitter.com/TzhkGIioQ1
— ChotaNews App (@ChotaNewsApp) February 21, 2025
తెలిసిన అన్నలే కావడంతో..
తెలిసిన అన్నలే కావడంతో చాక్లెట్ల ఆశకు బాలిక వారితో పాటు వెళ్లింది. ఇదే సమయంలో ఆ మృగాళ్లు పసిపాప అని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావమై అరవడంతో సమీపంలోని స్థానికులు వెంటనే వచ్చారు. నిందితుల్లో ఒకరిని పట్టుకుని చితకబాదారు. నిందితులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సంగారెడ్డి పోలీసులు వెల్లడించారు. బాలికను తీసుకుపోతున్న ఘటనలు సీసీటీవీలో రికార్డయ్యాయి.