MP Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ కు మెంటల్ ఎక్కింది...నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించిన కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి

2014, 2018 లో ఇచ్చిన హామీల్లో 20% కూడా అమలు చేయని మీరా మాకు చెప్పేది అని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

MP Chamala Kiran Kumar Reddy Strong Counter to KTR(video grab)

2014, 2018 లో ఇచ్చిన హామీల్లో 20% కూడా అమలు చేయని మీరా మాకు చెప్పేది అని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మాకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది... ఆలోపు ఇచ్చిన హామీలను మేము నెరవేర్చకపోతే మాకు ప్రజలే బుద్ది చెప్తారు అన్నారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏం అనుకుంటారో అన్న కనీసం ఆలోచన కూడా లేదు అన్నారు. అధికారం చేజారాక నిద్ర పట్టక ఏది పడితే అదే మాట్లాడుతున్నారు...కేవలం రైతులకే ఏకకాలంలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం అన్నారు.

200 ఉనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదా ? , 500 లకే గ్యాస్ సిలిండర్ రావడం లేదా ?, ఉచిత బస్సు నడవడం లేదా ? ఇవన్ని అమలు అవుతుంటే అర గ్యారంటీ అని ఎలా అంటాడు ? అని దుయ్యబట్టారు. కేటీఆర్ కు మెంటల్ ఎక్కింది.....చివరకు ఆయన మెంటల్ ఆసుపత్రికి వెళ్తాడు అని మండిపడ్డారు ఎంపీ చామల.  రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఛీటింగ్ కేసులు పెట్టాలి...జనవరి 21న నల్గొండలో రైతు ధర్నా చేస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్, షాబాద్ రైతు దీక్షకు భారీగా తరలివచ్చిన అన్నదాతలు

MP Chamala Kiran Kumar Reddy Strong Counter to KTR

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now