Bus Accident in Nalgonda: హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం.. నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘటన

హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం కాగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. నల్లొండ జిల్లా మర్రిగూడ వద్ద జరిగిందీ ఘటన.

Fire Accident (Credits: X)

Hyderabad, Dec 4: హైదరాబాద్ (Hyderabad) నుంచి నెల్లూరు (Nellore) వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో (Travel Buses) మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం కాగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. నల్లొండ జిల్లా మర్రిగూడ వద్ద జరిగిందీ ఘటన. శ్రీకృష్ణ ట్రావెల్స్‌ కు చెందిన బస్సు గతరాత్రి 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి నెల్లూరు బయలుదేరింది. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రలో ఉండగా నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అయితే, మంటలు వేగంగా విస్తరించి బస్సును చుట్టేయడంతో కొందరు ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మరికొందరు మాత్రం అతికష్టం మీద తప్పించుకోగలిగారు. ఒక ప్రయాణికుడు మాత్రం తప్పించుకోలేక సజీవ దహనమయ్యాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగాయి.

Kamareddy Result: గత సీఎం కేసీఆర్‌, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డిలను సాధారణ ప్రత్యర్థులుగానే చూశా.. కామారెడ్డి వీరుడు వెంకటరమణారెడ్డి స్పందన ఇది..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now