Sex Racket in Gachibowli:హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పక్కా సమాచారంతో పట్టుకున్న మాదాపూర్ పోలీసులు
హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్(Sex Racket in Gachibowli) గుట్టు రట్టు అయింది. గౌలిదొడ్డి TNGO’S కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పోలీసుల దాడులు
హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్(Sex Racket in Gachibowli) గుట్టు రట్టు అయింది. గౌలిదొడ్డి TNGO’S కాలనీలో విదేశీ అమ్మాయిల(Foreign girls)తో వ్యభిచారం జరుగుతుండగా వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ, HTF అధికారుల దాడులు చేశారు.
కెన్యా, టాంజానియా, బ్యాంకాక్‌కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేయగా 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వాహకుడి కోసం మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది.
ఇక మరోవైపు మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా ప్రారంభమైంది. పుష్య మాస అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నాగోబా దేవాలయం ఉండగా జాతర కోసం మహారాష్ట్ర , చత్తీస్‌ఘడ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున్న ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ కు చేరుకున్నారు. ప్రారంభమైన నాగోబా జాతర..గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, జాతరలో హైలైట్‌గా నిలవనున్న ప్రజాదర్బార్
Sex Racket Busted in Gachibowli