Suicide Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, గీతం యూనివర్సిటీలో బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బీటెక్‌ విద్యార్ధిని

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనం అయిదవ అంతస్తు నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది

Representational Image (Photo Credits: File Image)

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనం అయిదవ అంతస్తు నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే దీనికి గల కారణాలు తెలియల్సి ఉంది.కాగా ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకుతున్న వీడియో వైరల్ అవుతోంది. యువతి ఆత్మహత్య చేసుకుంటుండగా తోటి విద్యార్ధులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా రేణు శ్రీ కుటుంబం మాదాపూర్‌లో నివసిస్తోంది. కూతురు ఆత్మహత్య విషయం తెలుసుకొని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement