CM KCR Health Update: య‌శోద‌ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఎం కేసీఆర్, ఎలాంటి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేవ‌ని తెలిపిన వైద్యులు

తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేప‌టి క్రితం య‌శోద‌ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేటి ఉద‌యం కాస్త న‌ల‌త‌గా అనిపించ‌డంతో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు య‌శోద ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఎడ‌మ చేయితో పాటు కాలు కూడా లాగుతున్న‌ట్లుగా ఉంద‌ని కేసీఆర్ చెప్ప‌డంతో ఆయ‌న‌కు గుండె సంబంధిత వ్యాధులేమైనా ఉన్నాయా? అన్న‌ కోణంలో య‌శోద ఆసుప‌త్రి వైద్యులు ప‌లు వైద్య ప‌రీక్ష‌లు చేశారు.

CM KCR at Yoshada Hospital (Photo-ANI)

తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేప‌టి క్రితం య‌శోద‌ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేటి ఉద‌యం కాస్త న‌ల‌త‌గా అనిపించ‌డంతో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు య‌శోద ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఎడ‌మ చేయితో పాటు కాలు కూడా లాగుతున్న‌ట్లుగా ఉంద‌ని కేసీఆర్ చెప్ప‌డంతో ఆయ‌న‌కు గుండె సంబంధిత వ్యాధులేమైనా ఉన్నాయా? అన్న‌ కోణంలో య‌శోద ఆసుప‌త్రి వైద్యులు ప‌లు వైద్య ప‌రీక్ష‌లు చేశారు. యాంజియోగ్రామ్‌తో పాటుగా సిటీ స్కాన్‌, ఈసీజీ త‌దిత‌ర ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. ప‌రీక్ష‌ల అనంత‌రం కేసీఆర్‌కు ఎలాంటి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేవ‌ని య‌శోద ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. అంతేకాకుండా ఆయ‌న‌ను ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement