Congress Leaders Dance Video: తెలంగాణ కాంగ్రెస్ నేతల డ్యాన్స్ వైరల్, కొత్త స్టెప్పులతో అదరగొట్టిన దామోదర రాజనర్సింహ, విహెచ్ హనుమంతరావు

భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతోంది. గురువారం రాత్రి పాదయాత్రను ముగించే సందర్భంగా జిల్లా పరిధిలోని అందోల్ లో భారీ బహిరంగ సభను జరిగింది.

Congress leaders Dance (Photo-Video Grab)

భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతోంది. గురువారం రాత్రి పాదయాత్రను ముగించే సందర్భంగా జిల్లా పరిధిలోని అందోల్ లో భారీ బహిరంగ సభను జరిగింది. అందోల్ సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ క్రమంలో రాహుల్ ప్రసంగం ముగిసినంతనే సంతోషం పట్టలేక మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన పక్కనే ఉన్న నేతలతో కలిసి చిందులేయడం మొదలెట్టారు. దామోదరను స్టెప్పులను చూసిన సీనియర్ నేత వి.హన్మంతరావు తన వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా డ్యాన్స్ చేశారు. ఇద్దరు కీలక నేతలు స్టేజీ మీదే మైమరచి స్టెప్పులేస్తున్న వైనం చూసి పార్టీ శ్రేణులు కేరింతలు కొట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now