Telangana Election Results 2023: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉండగా కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని అధికార ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత వెలుబడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉండగా కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు.
రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగిన సంగతి తెలిసిందే.
Here's News