Sangareddy Fire Videos: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, డైరెక్టర్‌‌తో పాటుగా ఆరుగురు కార్మికులు మృతి, వీడియోలు ఇవిగో..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ఈరోజు( బుధవారం) రియాక్టర్‌ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితో పాటు మరో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Six dies Reported After Blaze Triggers Explosion at Chemical Factory in Sangareddy

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ఈరోజు( బుధవారం) రియాక్టర్‌ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితో పాటు మరో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లుగా సమాచారం. భూంకంపం ధాటికి భారీ భవనాలు ఎలా కూలుతున్నాయో వీడియోలో చూడండి, తైవాన్ సునామి ధాటికి నేలకొరిగిన ఫ్లైఓవర్లు

మృత‌దేహాల‌ను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి త‌ర‌లించారు.క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులను బయటకు తీసుకురావడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారిని అక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement