Viral Video: వీడియో ఇదిగో, చేపల లారీ బోల్తా, ఏరుకునేందుకు ఎగబడిన స్థానికులు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో వాటిని ఏరుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకుని సంచుల్లో వేసుకుని తీసుకెళ్లారు. లారీ ఖమ్మం వైపు నుంచి వరంగల్ వెళ్తుండగా లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది.

Telangana: Fish-laden truck overturns in Maripeda, People rush to collect fish from truck Watch Viral Video

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో వాటిని ఏరుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకుని సంచుల్లో వేసుకుని తీసుకెళ్లారు. లారీ ఖమ్మం వైపు నుంచి వరంగల్ వెళ్తుండగా లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. లారీ బోల్తాపడడంతో అందులో బతికున్న చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి కొట్టుకున్నాయి. వాటిని చూసిన జనం ఏరుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని అదుపు చేశారు.

షాకింగ్ వీడియో, బస్సు నుంచి జారి చక్రాల కింద పడి మృతి చెందిన విద్యార్థి, బోరబండలో విషాదకర ఘటన

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement