Seethakka Swearing-In Video: వీడియో ఇదిగో, గవర్నర్ సీతక్కను పిలవగానే హోరెత్తిన ఎల్బీ స్టేడియం, దైవ సాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేసిన గిరిజన బిడ్డ
తెలంగాణలో రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడంతో పాటు, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గిరిజన బిడ్డగా నక్సలైట్ నుండి మంత్రిగా ఎదిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణస్వీకారం అందరికీ ఆసక్తిని కలిగించింది.
తెలంగాణలో రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడంతో పాటు, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గిరిజన బిడ్డగా నక్సలైట్ నుండి మంత్రిగా ఎదిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణస్వీకారం అందరికీ ఆసక్తిని కలిగించింది.ప్రమాణస్వీకారానికి సీతక్కని పిలిచిన వెంటనే ఆమె వేదికపైకి చేరుకోగానే అభిమానులు కేరింతలతో హోరెత్తారు.
ఎల్బీ స్టేడియం ప్రాంగణమంతా మోత మోగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తన అభిమానులకు అభివాదం చేసిన సీతక్క మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెబితే సీతక్క మాత్రం దైవ సాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేశారు.అనంతరం సీతక్క ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హత్తుకుని, నవ్వుతూ ఆమె భుజం తట్టి అభినందనలు తెలియజేశారు. సీతక్క మాత్రమే కాదు కొండా సురేఖను సైతం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆలింగనం చేసుకోవడంతో కొండా సురేఖ భావోద్వేగానికి లోనయ్యారు. వీడియో ఇదిగో..
Here's Video