Corona in TS: తెలంగాణలో కొత్తగా 179 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు, ఇంకా 4,023 మందికి కొనసాగుతున్న చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,588 కరోనా పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు గుర్తించారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,588 కరోనా పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు గుర్తించారు. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 104 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,453 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,481 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,023 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,949కి పెరిగింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement