Corona in TS: తెలంగాణలో తాజా కరోనా కేసులు అప్‌డేట్ ఇదిగో.., హైదరాబాదులో అత్యధికంగా 277 కొత్త కేసులు, గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 640 మందికి కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణలో 31265 కరోనా పరీక్షలు నిర్వహించగా, 640 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 277 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 50, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 45, ఖమ్మం జిల్లాలో 32, పెద్దపల్లి జిల్లాలో 15, నల్గొండ జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

గడచిన 24 గంటల్లో తెలంగాణలో 31265 కరోనా పరీక్షలు నిర్వహించగా, 640 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 277 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 50, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 45, ఖమ్మం జిల్లాలో 32, పెద్దపల్లి జిల్లాలో 15, నల్గొండ జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 659 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదుకాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,11,616 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,03,013 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,492 మంది చికిత్స పొందుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement