Corona in TS: తెలంగాణలో కొత్తగా 73 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 33 కొత్త కేసులు నమోదు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,666 కరోనా పరీక్షలు నిర్వహించగా, 73 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో కరోనా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Representative image

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,666 కరోనా పరీక్షలు నిర్వహించగా, 73 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో కరోనా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,864 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,114 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 639 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement