Corona in TS: తెలంగాణలో తగ్గిపోయిన కేసులు, గత 24 గంటల్లో 91 మందికి కరోనా, హైదరాబాద్ పరిధిలో 40 కొత్త కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,966 కరోనా పరీక్షలు నిర్వహించగా, 91 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 241 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,966 కరోనా పరీక్షలు నిర్వహించగా, 91 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 241 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో కరోనాతో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,951 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,84,465 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,375 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement